Monday, July 15, 2024
Homeతెలంగాణబాలికలకు మానసిక,శారీరక ఆరోగ్యం పట్ల అవగాహన ముఖ్యం..

బాలికలకు మానసిక,శారీరక ఆరోగ్యం పట్ల అవగాహన ముఖ్యం..

బాలికలకు మానసిక,శారీరక ఆరోగ్యం పట్ల అవగాహన ముఖ్యం..

జడ్పీటీసీ తగరం సుమలత

మంథని ఏప్రిల్ 19(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆచార్య ఫౌండేషన్ నిర్వహించిన బాలికల వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తగరం సుమలత జెడ్పిటిసి పాల్గొని నేడు మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా,శారీరకంగా పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈకార్యక్రమంలో ఫౌండేషన్ వారు అందించిన శానిటరీ నాపికిన్ లు ఉచితంగా అందించారు.జెడ్పిటిసి మాట్లాడుతూ ఫౌండేషన్ వారు ఋతుక్రమం ద్వారా ఎదురయ్యే పలు సమస్యలను,పరిష్కారాలతో సామాజిక చైతన్యం కల్పించడం బాగుందని అభినందించారు.ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ శారద మాట్లాడుతూ నేడు బాలికలు పరిశుభ్రత ద్వారా ఆరోగ్యము రక్షించుకొని,భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని పేర్కొన్నారు.బాలికలు సమతుల్య ఆహారంతో విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని తెలిపారు.మండల విద్యాధికారి లక్ష్మి మాట్లాడుతూ ఆచార్య ఫౌండేషన్ అందిస్తున్న సామాజిక సేవలను కొనియాడారు.బాలికలు సృజనాత్మకంగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు రూపొందిస్తే సమాజానికి మేలు చేసిన వారిగా గుర్తింపు తెచ్చుకోవచ్చని తెలియజేశారు.ఈకార్యక్రమంలో ఆచార్య ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ జవ్వాజి. రాజేష్,ఖాజ అలీమోద్దీన్, కొమిరిశెట్టి రమేష్,లత,శ్రీదేవి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ జి.స్వరూప, ఉపాధ్యాయులు డి. స్వరూప,అరుణ,వరలక్ష్మి, భాగ్యలక్ష్మి తో పాటు,విద్యార్థినిలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!