Thursday, September 19, 2024
Homeతెలంగాణశ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో  బ్రహ్మోత్సవాలు

శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో  బ్రహ్మోత్సవాలు

శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో  బ్రహ్మోత్సవాలు

గజ్వేల్,ఎప్రిల్13(కలం శ్రీ న్యూస్):సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని పురాతన దేవాలయం శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో 6 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా గురువారం 2 వ రోజు శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో పురోహితుల వేద మంత్రాలతో వాసుదేవ పున్యాహ వచవనము, యాగశాల ప్రవేశం,వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు, మఠం నవీన్ కుమార్ , దేశపతి రాజశేఖర్ శర్మ , మఠం శివకుమార్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్.రాజమౌళి ,మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ , నేతి శ్రీనివాస్, కళ్యాణ్కర్ నర్సింగరావు, సుంకరి బాల్ కుమార్ ,జంగం రమేష్ గౌడ్,తూం. శ్రీధర్ నాగేందర్ రావు, భక్తులు ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!