శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయం.
ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని ఏప్రిల్ 13(కలం శ్రీ న్యూస్ ):మంథని శ్రీపాద చౌక్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు 24వ వర్ధంతి సందర్భంగా శ్రీపాద చౌక్, రాహుల్ చెరువు కట్ట లో శ్రీపాద రావు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించిన ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యేే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంథని ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పనిచేసిన మహనీయులు శ్రీపాద రావు 24వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిచాము.
ఏప్రిల్ 13వ తేదీ 1999 జరిగిన సంఘటన ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు, మర్చిపోలేదు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన విధంగా గుర్తు చేసుకుంటూ నేటి వరకు కూడా మర్చిపోలేదు అంటే ఇది మాకు ఒక స్ఫూర్తిదాయకమైన విషయం.ఎల్లప్పుడూ అభివృద్ధి, సంక్షేమం వైపు పని చేసే ఒక నాయకుడు శ్రీపాద రావు.రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులలో సింహ భాగాన్ని మంథని ప్రాంతానికి తీసుకురావాలన్నదే వారి తాపత్రయం.కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మాటలు మాట్లాడతారు.శ్రీపాద రావు మొదటిసారి ఎన్నికైనప్పుడు ఒక సంవత్సరం కాలం మాత్రమే కొనసాగారు.రెండవసారి ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు.మూడవసారి అధికారపక్షంలో స్పీకర్ గా వస్తే మూడున్నర సంవత్సరాలు ఈ ప్రాంతం అభివృద్ధి సంక్షేమం కోసం ఎల్లప్పుడు కూడా ఆలోచన చేశారు.ప్రతిపక్షంలో ఉన్న అధికారపక్షంలో ఉన్న అమాయకులు బలికావద్దని కొట్లాడి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి శ్రీపాద రావు అలాంటి వారి గురించి కొంతమంది వ్యక్తులు వాస్తవాలను వక్రీకరించే పనిలో ఉన్నారు వాస్తవిక విషయాలు ప్రజలందరికీ తెలుసు అని ప్రజలు గమనిస్తున్నారనిి, వారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మర్చిపోరు.అభివృద్ధి సంక్షేమం విషయాలలో కాంగ్రెస్ పార్టీ జవాబు చెబుతుంది.హింస కక్ష సాధింపు చర్యలను దగ్గరకు రనివద్దు రాయలసీమ ప్రాంతంగా మంథని మారకూడదు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శాంతియుతంగా ముందుకు పోవాలి.ఈ ప్రాంతానికి మేలు చేసే దిశలో ఓర్పుగా నేర్పుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తావుంది.శ్రీపాద రావు ఆశయాల కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఎన్ని ఇబ్బందులకు,అవమానాలకు గురిచేసిన ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో ముందు ఉంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంజనీరింగ్ ,మెడికల్ కాలేజ్ లు, అనేక విద్యాలయాలు ఉండాలి అని వారి ఆశయ సాధన లో బాగంగా 2004 నుండి 2014 అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ప్రజలు ఇంకా అవకాశం ఇస్తే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారి ఆశయ సాధన కోసం పని చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు