జర్నలిస్ట్ సారయ్య మృతి తీరని లోటు
మంథని, ఏప్రిల్ 9(కలం శ్రీ న్యూస్ ):సీనియర్ జర్నలిస్ట్ సారయ్య అకాల మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అంకరి కుమార్, పోతరాజు సమ్మయ్య అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో సారయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా పత్రికా రంగంలో పనిచేసి అందరికీ ఆప్తుడిగా ఉన్నాడన్నారు. మంథని నియోజక వర్గం కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన నారా సారయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. అనంతరం ఆయన ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఐ జే యూ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాష్, క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ మోత్కురి శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ల బాపు, సీనియర్ పాత్రికేయులు కంది కృష్ణా రెడ్డి, రావుల తిరుమల్, గంధం ఆంజనేయులు, లక్కకుల నాగరాజు, బాసాని సాగర్ పాల్గొన్నారు.