ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని, ఏప్రిల్ 8(కలం శ్రీ న్యూస్ ):మంథని మున్సిపల్ పరిధిలోని జామా మసీదులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రంజాన్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేసుకుంటున్నారు.రంజాన్ పండుగను ముస్లింలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కొరారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.