కాంగ్రెస్ శ్రేణులకు మార్గ నిర్థేశం చేసిన కర్రు నాగయ్య
మంథని, ఏప్రిల్ 8(కలం శ్రీ న్యూస్ ):మంథని ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబు ఈనాడు తమ ప్రభుత్వం లేదంటూ నాలుగేండ్లుగా దాటవేస్తున్నాడని, రాబోయేది కూడా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అదికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యే మాటలు విని కాలం వృధా చేసుకోవద్దని కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు కర్రు నాగయ్య పేర్కొన్నారు. కమాన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన కాంగ్రెస్‌శ్రేణులకు మార్గనిర్థేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఉన్నా వారంతా ఊరి రాజకీయాల కోసమే ఉంటున్నా అసంతృప్తితోనే ఉన్నారని, స్థానిక ఎమ్మెల్యేతో ఎలాంటి లాభం జరుగలేదన్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ నియోజకవర్గ అభివృధ్దితో పాటు కార్యకర్తలకు అండగా నిలిస్తే ఎన్నికల్లో ఆయనకు అన్యాయం చేశామని, అలాంటి తప్పు మరోసారి చేయకుండా ప్రజల్లోకి వెళ్లి చైతన్యం చేయాలన్నారు. పుట్ట మధూకర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని, కాంగ్రెస్ కార్యకర్తలు సైతం కాలం వృధా చేయకుండా పనిచేసే నాయకుడికి అండగా నిలువాలని అన్నారు.