అవధుల్లేని త్యాగధనుడు యేసుక్రీస్తు
మంథని,ఏప్రిల్ 7 (కలం శ్రీ న్యూస్ ): తనను సిలువ వేసి, తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు యేసుక్రీస్తు అని పాస్టర్ పేర్కొన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మంథని పట్టణంలోని సీయోను ప్రార్థన మందిరంలో మానవుల కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ‘గుడ్ ఫ్రైడే’ క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని పేర్కొన్నారు.సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల జాలి, అవధులులేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగి ఉండటం కరుణామయుడైన యేసుక్రీస్తుకే సాధ్యమైందని కొనియాడారు.ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. శాంతి,సహనం,అహింస,సౌభ్రా తృత్వాలను క్రీస్తు తన ఆచరణీయమైన జీవితం ద్వారా సమస్త మానవాళికి సందేశంగా ఇచ్చాడని ఆయన తెలిపారు. విభేదాలు,తారతమ్యాలు లేకుండా మనుషులంతా ఒక్కటిగా కలిసి ఉండేందుకు యేసుక్రీస్తు బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు.ప్రజల మధ్యశాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అనే క్రీస్తు బోదనలు అందరూ ఆచరించదగినవన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మంథని పురవీధుల గుండ శిలువ ధ్యాన సువార్త అనే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు వల్లూరి ప్రభాకర్, కల్వల సామ్యెల్, మందని నవీన్, చందు, దయారాజ్, మార్క్ గ్లాడాన్, సంఘ పెద్దలు అంకరి కుమార్, ఎం.కె.జోసఫ్, మంథని రణవీర్, ప్రేమ్ కుమార్, ప్రసాద్, రమేష్, సదానందం,హేమలత, మనోహరమ్మ పాల్గొన్నారు