బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గాజుల అరుణ్
పెద్దపల్లి,ఎప్రిల్06(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ బిసి సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గాజుల అరుణ్ పటేల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ పటేల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు బీసీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఐక్యత చాటేందుకు కృషి చేస్తానని అన్నారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర, మంతిని రఘువీరా ప్రసాద్, సబ్బు సతీష్, నోముల శ్రీధర్, గుండేటి రాజేశం, పాల అడుగుల కనకన్న, పిట్టల రమేష్ లతోపాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు.