Sunday, December 10, 2023
Homeతెలంగాణశ్రీపాద కుటుంబం వల్లే మనం వెలుగులోకి వచ్చాం:సెగ్గెం రాజేష్ 

శ్రీపాద కుటుంబం వల్లే మనం వెలుగులోకి వచ్చాం:సెగ్గెం రాజేష్ 

శ్రీపాద కుటుంబం వల్లే మనం వెలుగులోకి వచ్చాం:సెగ్గెం రాజేష్ 

మంథని ఏప్రిల్ 5(కలం శ్రీ న్యూస్ ):నీచమైన చరిత్ర కలిగిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పదే పదే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును నీచమైన వాడు అనడం హేయమైన చర్య అని మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సెగ్గెం రాజేష్ అన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత శ్రీపాదరావు వల్లనే పుట్ట మధు గాని, తాము అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని మరిచి ఇష్టమున్నట్లు మాట్లాడడం అవివేకమని ఆయన విమర్శించారు. మంథని చరిత్రలో 40 సంవత్సరాలలో అన్ని గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఆయన గుర్తు చేశారు. పుట్ట మధు తన హయాంలో ఏ ఒక్కరికైనా ఇల్లు ఇప్పించాడా అని ఆయన పేర్కొన్నారు. పుట్ట మధుకు ప్రాణ భిక్ష పెట్టిన శ్రీపాదరావును కించపరుస్తూ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఇకముందు శ్రీపాదరావును విమర్శిస్తే తన తండ్రి చరిత్ర గురించి చెప్పడం జరుగుతుందన్నారు. విద్యావంతుడైన శ్రీధర్ బాబు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశాడని ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు మాట్లాడుతూ సూరయ్య పల్లె కూడలి వద్ద మంగళవారం ప్రతిష్టించిన ఏకలవ్యుడి విగ్రహం కార్యక్రమంలో సూర్యయ్య పల్లె గ్రామస్తులు ఎవరు పాల్గొనలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి శ్రీధర్ బాబు ప్రయత్నించాడు అనడం సిగ్గుచేటు అన్నారు. శ్రీధర్ బాబు పిలుపునిస్తే సూరయ్య పల్లి గ్రామ పొలిమేరలో కూడా పుట్ట మధును గ్రామస్తులు రాణిచ్చే వారు కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి పేరవేనా లింగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంథని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, ఉపాధ్యక్షుడు ఆర్ల నారాయణ, మాజీ సర్పంచు మాసిరెడ్డి రాజిరెడ్డి, పార్టీ నాయకులు లై శెట్టి రాజు, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!