Wednesday, November 29, 2023
Homeతెలంగాణమహనీయుల స్పూర్తితోనే అట్టడుగు వర్గాల అభివృద్దికి కృషి చేస్తున్నం 

మహనీయుల స్పూర్తితోనే అట్టడుగు వర్గాల అభివృద్దికి కృషి చేస్తున్నం 

మహనీయుల స్పూర్తితోనే అట్టడుగు వర్గాల అభివృద్దికి కృషి చేస్తున్నం 

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 

మంథని ఏప్రిల్ 5(కలం శ్రీ న్యూస్ ):అట్టడుగు వర్గాల అభివృద్ది కోసం ఆనాడు త్యాగాలు చేసిన మహనీయుల స్పూర్తితోనే ఈనాడు ముందుకు సాగుతున్నామని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ అన్నారు.మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్బంగా బుధవారం మంథని పట్టణంలోని బాబు జగ్జీవన్‌ రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ.ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ ఏసమాజంలో నైతే జన్మించాడో ఆ సమాజానికి తనవంతు తోడ్పాటునందించి తాను ఉన్నపార్టీని ఒప్పించి ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచన చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రాం అని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే మహనీయుడు మన కోసం మన భవిష్యత్‌ తరాల కోసం పాటుపడ్డారని ఆయన గుర్తుచేశారు.అట్టడుగు వర్గాలకు అక్షరజ్ఞానంతోనే అభివృధ్ది సాధ్యమవుతుందని ఆలోచన చేసిన జ్యోతిరావుపూలే చదువులు నేర్చించి తండ్రిస్థానంలో నిలిచారన్నారు. ఈనాడు మనల్ని సమాజంలో గౌరవిస్తున్నారంటే కేవలం ఓటు హక్కు ఉందనేనని, ఈనాటికి మనలను ప్రేమించే వారు.ఇష్టపడే వారు లేరన్నారు. ఓటు హక్కు ఉందనే కారణంతోనే ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారని అన్నారు.ఆనాడు మనవర్గాలకు ఆత్మగౌరవం దక్కాలని, మన హక్కులు సాధించుకోవాలంటే, మన ఆకలి తీరాలంటే ఓటు హక్కు ఒక్కటేమార్గమని గుర్తించిన బీఆర్‌ అంబేద్కర్‌ అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఓటుహక్కు సాధించారని ఆయన తెలిపారు. బీసీ సామాజికవర్గం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచిన తాను మహనీయుల చరిత్రను చాటి చెప్పాలనే ఆలోచన చేసి నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం ప్రారంభించినట్లు తెలిపారు. మనం దేవుళ్లుగా బావించే జ్యోతిరావుపూలే విగ్రహాన్ని 2016లో, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని 2015లో, జగ్జీవన్‌రాం విగ్రహాన్ని 2017లో, సర్థార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని 2017లో, పార్టీతో సంబంధం లేకుండా ఆర్థిక సంస్కరణలతో దేశం గొప్పగా నడిచేలా చేసి యువతకు మార్గదర్శకంగా నిలిచిన పీవీ నర్సింహరావు విగ్రహాన్ని 2016లో, స్వామి వివేకానంద విగ్రహాన్ని 2022లో, ఏకలవ్యుడి విగ్రహాన్ని 2023లో ఆవిష్కరణ చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ నియోజకవర్గంలో అత్యధికశాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదల స్వాతంత్రం కోసం తన కృషి కొనసాగుతుందన్నారు. బాబు జగ్జీవన్‌రాం కాంగ్రెస్‌పార్టీ నాయకుడైనా బీసీ సామాజికవర్గం నుంచి వచ్చి ఆ సామాజికవర్గం కోసం ఆలోచన చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. ఈ ప్రాంతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృధ్ది కోసం నిరంతరం కృషి చేస్తామని, ఈ ప్రాంతంలోని వనరులను వినియోగించుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. గతంలో ఈ ప్రాంతంలోని ఓసీపీల్లో స్థానికేతరులు మాత్రమే ఉద్యోగాలు చేసేవారని, కానీ స్థానికత 80శాతం ఉండాలనే ఆలోచనతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన గుర్తు చేశారు. ఒక బీసీ సామాజికవర్గ నుంచి ప్రజాప్రతినిధి అయితే ఎలాంటి అభివృధ్ది జరుగుతుందో చేసి చూపించామని ఆయన అన్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందని, ఈ క్రమంలో ఈ మాసాన్ని మహనీయుల మాసంగా ప్రకటించి గత ఏడాది మహనీయుల జన్మస్థలాలు, పుణ్యస్థలాలను సందర్శించడం జరిగిందన్నారు. జ్యోతిరావుపూలు, అంబేద్కర్‌ లాంటి మహనీయుల జన్మస్థలాలు, పుణ్యస్థలాలను దర్శించుకోవడం అదృష్టంగా బావించినట్లు తెలిపారు. మహనీయుల ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని, అంబేద్కర్‌ వారసుడిగా ఈ ప్రాంతంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి పాటుపడుతామని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!