మంథనిలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి హౌస్ అరెస్ట్
మంథని ఏప్రిల్ 05(కలం శ్రీ న్యూస్ ):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు.అలాగే పలువురు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ ఎలాంటి కేసు,వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?, తెలంగాణలో నిర్వహించే పరీక్ష పత్రాలు లీక్ అవుతుంటే వాటిని అదుపు చేయడం లేదని,ఆఖరికి పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయి వాట్సాప్ లో వస్తున్నా పట్టించుకోని అసమర్ధ ప్రభుత్వం అని, కెసిఆర్ రజాకారుల పాలన కొనసాగిస్తున్నారనీ, అసమర్ధ పాలనను ఎండగడుతున్న బిజెపి పై అక్కసుతో ఇలాంటి అక్రమ అరెస్టులతో పోరాటాలను, అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు కెసిఆర్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని, బేషరతుగా బండి సంజయ్ ని, మా నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ నాయకులు మంథని పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, బూత్ స్వశక్తి అభియాన్ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్, మండల ఇంచార్జ్ వీరబోయిన రాజేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సాదుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు పోతారవేణి క్రాంతికుమార్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.