మంథని అంగన్ వాడి కేంద్రంలో సీమంతం
మంథని, ఏప్రిల్ 03(కలం శ్రీ న్యూస్ ): మంథని పట్టణంలోని పదకొండవ అంగన్వాడీ కేంద్రం లో సోమవారం గర్భిణులకు సీమంతం చేశారు.పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్ వాడి కేంద్రం పరిధిలోని మహిళలకు పోషక విలువలు కలిగిన చిరు ధాన్యాల పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా గర్భిణులకు సీమంతం చేశారు.చిరుధాన్యాలు కలిగిన పోషకహర పదార్థాలను చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు తల్లులు అందించాలని కౌన్సిలర్ వికె రవి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ ఆరెపల్లి కుమార్,ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు స్వప్న,అంగన్వాడి టీచర్ కరుణ శ్రీ, ఎఎన్ఎం రాధ,ఆశకార్యకర్త రూప లు పాల్గొన్నారు.