అవార్డు గ్రహీతకు జెడ్పీ ఛైర్మన్ సన్మానం
మంథని ఏప్రిల్ 01(కలం శ్రీ న్యూస్):ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పలిమెల మండలం ముకునూరు సర్పంచ్ ఆలం సత్యనారాయణను మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సన్మానించారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ముకునూరు సర్పంచ్ సత్యనారాయణ జెడ్పీ చైర్మన్ ని కలువగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.