జెడ్ పి చైర్మన్ తో ముఖాముఖిని విజయవంతం చేయండి
మంథని మార్చి 28(కలం శ్రీ న్యూస్ ): పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తో ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతి కోరారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ మంథని నియోజకవర్గ అభివృద్ధిపై పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తో ముఖి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏప్రిల్ 4న నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పైన సలహాలు సూచనలు ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు.ఈ నియోజక వర్గంలోని ప్రజా ప్రతినిధులు, పూర్వ ప్రజాప్రతినిధులు, రాజకీయలకు అతీతంగా విభిన్న పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, మేధావులు, యువజనులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సమన్వయకర్తలు కాజా మైనుద్దీన్, రామడుగు మారుతీ రావు, ఓల్లాల అశోక్ పాల్గొన్నారు