చిరుధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం
మంథని మార్చి 28(కలం శ్రీ న్యూస్ ): చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండవచ్చని అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మిఅన్నారు.మంథని మండలంలోని బిట్టుపల్లి అంగన్వాడీ కేంద్రంలోమంగళవారం మిల్లెట్స్ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.అత్యధిక పోషక విలువలు కలిగిన రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, శనగలు, గోదుమలను గర్భిణీ స్త్రీలు బాలింతలు చిరుధాన్యాల ఆహార పదార్థాలు తినడం ద్వారా అత్యధిక పోషక విలువలు కలిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోగుల సదానందం,పంచాయతి సెక్రటరీ భాగ్యలక్ష్మి గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.