మంథని ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు:
సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్
మంథని మార్చి 28(కలం శ్రీ న్యూస్ ):మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటరీ సిబ్బందికి 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్ కార్మికులు నల్ల బ్యాడ్జిలు ధరించి హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బురద గణేష్ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు ఇవ్వకుంటే కార్మికులు ఏం తిని బతకాలని ప్రశ్నించారు. సంబంధిత కాంట్రాక్టర్ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా జీవో ప్రకారం 15,600 ఇవ్వాల్సి ఉండగా కేవలం నెలకు 5000 మాత్రమే ఇచ్చి కార్మికుల కడుపు కొడుతున్నారని విమర్శించారు.అవి కూడా ఇవ్వకుండా ఐదు నెలలుగా ఇవ్వకపోవడం కార్మికులు పస్తులుండి విధులకు హాజరవుతున్నారని వారి కుటుంబాలు తిండి లేక అలమటిస్తున్నారని అప్పుల పాలవుతున్నారని కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన వీరికి జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గం అని అన్నారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్ వెంటనే స్పందించి వారం రోజుల్లో గా జీవో ప్రకారం వేతనాలు ఇస్తూ ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని పిఎఫ్,ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని కార్మికులకు దుస్తులు ,సబ్బులుు, నూనెలుు, గ్లౌజులుు, మాస్కులుు, చీపుర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులను కలుపుకొని నిరదిక సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. అనంతరం ధర్నా దగ్గరికి వచ్చిన సూపర్డెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. దీనికి ఆయన స్పందిస్తూ సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి వారం రోజుల్లో గా అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు దీంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆకుల శ్రావణ్,చందు, లక్ష్మి,అంజలి పద్మ,ప్రమీల, చంద్రయ్య, శ్రీనివాస్, రమాదేవి, భారతి తదితర కార్మికులు పాల్గొన్నారు.