ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల మార్చి 23(కలం శ్రీ న్యూస్):ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఆశ్రయం ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత్ రావు పేట గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత.
ఈ వైద్య శిబిరం లో మొత్తం 618 మంది హాజరయ్యారు, ఇందులో షుగర్ 216, ఈసీజీ 57, బ్లడ్ పరీక్షలు 187, ఎక్స్ రేలు 216 పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమానికి బుగ్గారం మండల ఎంపీపీ జెడ్పీటీసీ బాధినేని రాజమణి- రాజేందర్, వైస్ ఎంపీపీ జోగినిపెళ్ళి సుచింధర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తాండ్ర సత్య నారాయణ రావు , గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.