Monday, July 15, 2024
Homeతెలంగాణసిపిఎం జన చైతన్య యాత్ర బుక్ లెట్స్ ఆవిష్కరణ

సిపిఎం జన చైతన్య యాత్ర బుక్ లెట్స్ ఆవిష్కరణ

సిపిఎం జన చైతన్య యాత్ర బుక్ లెట్స్ ఆవిష్కరణ

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్

మంథని మార్చి 23(కలం శ్రీ న్యూస్):సిపిఎం జన చైతన్య యాత్ర యొక్క బుక్ లెట్స్ ను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గురువారం మంథని లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక,నిరుపేద ప్రజలపై దాడి మొదలు పెట్టిందని ఒక ప్రక్క నిత్య అవసరాల వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరో ప్రక్క రైతులపై రైతు వ్యతిరేక చట్టాలు విద్యుత్ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతుల మెడపై ఉరితా లు పెడుతుందని విమర్శించారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు విద్యారంగాన్ని అప్పజెప్పుతున్నదని దేశంలో ఉన్న బొగ్గు స్టీలు రైలు విమాన ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారా దత్తం చేస్తూ కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తుందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులు, గిరిజనులు, క్రిస్టియన్ మైనార్టీల మీద దాడులు పెరిగాయని అన్నారు. బిజెపి నిరంకుశ పాలను నిరసిస్తూ కొనసాగే జన చైతన్య యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మంతిని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ,ఎంపీపీ కొండ శంకర్ జడ్పిటిసి తగరం సుమలత, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కుమారస్వామి, ఏ మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!