చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 20(కలం శ్రీ న్యూస్ ):మంథని అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుండ్రెడ్డి సుధాకర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న ఢిల్లీ మహానగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టం తేవాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఉపాది హామీ పథకాన్ని బలోపేతం చేసి అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించాలని డిమాండ్లతో కార్యక్రమం నడుస్తుందని అన్నారు. అదేవిధంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాలేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న ఆరెంద మల్లారం కాన్సాయిపేట గ్రామాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.భవన నిర్మాణ కార్మికుల వలె అమాలి కార్మికులకు గూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో హమాలీ కార్మికులు రైతులు పాలుగోన్నారు