ఘనంగా అంబేద్కర్ విగ్రహ వార్షికోత్సవ, కాన్షీరాం జయంతి వేడుకలు.
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల, మార్చి15 (కలం శ్రీ న్యూస్):వెల్గటూరు మండలం జగదేవ్ పేటలో నెలకొల్పిన డాక్టర్ బాబా సాహెబ్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మరియు బహుజన రాజ్యాధికార యోధుడు మాన్యవర్ కాన్షిరాం 89 వ జయంతోత్సవ వేడుకలను బుధవారం రోజున జగదేవుపేట గ్రామంలో అన్ని పార్టీల, అన్ని సంఘాల నేతల మధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్ వద్ద పార్టీలకు అతీతంగా మండల గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, పెద్దలు, ఆయా సామాజిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఫూలే, అంబేద్కర్, అభ్యుదయ, ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు, యువకులు, మహిళా సోదరిమణుల సమక్షంలో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి అతిథులచే పూలమాలలు వేసి పుష్పాలు చల్లి అనంతరం మాన్యవర్ కాన్షిరాం చిత్ర పటానికి పూలహారం వేసి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆహ్వాన కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.