Monday, July 15, 2024
Homeతెలంగాణగురుకులాలను సద్వినియోగం చేసుకోండి 

గురుకులాలను సద్వినియోగం చేసుకోండి 

గురుకులాలను సద్వినియోగం చేసుకోండి 

ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి

నేడే దరఖాస్తులకు చివరి తేదీ 

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

 మంథని,మార్చి 15(కలం శ్రీ న్యూస్):-తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశంకై దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. నేడే( మార్చి 16) గురుకుల దరఖాస్తుకు చివరి రోజు అని, దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. పాత్రికేయులకు తెలిపిన ప్రకటనలో గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని, TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో ప్రవేశమునకై 2023-24 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21 వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో ప్రవేశమునకై 23-04-2023 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు అన్ని జిల్లాలలో (ఎంపిక చేయబడిన కేంద్రాలలో) ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి. అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు http://tswreis.ac.in (లేదా) http:tgtwgurukulam.telangana.gov.in (లేదా) http://mjptbcwreis.telangana.gov.in (లేదా) http://tgcet.cgg.gov.in లను దర్శించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది రకాల సూచనలు పాటించవలసి ఉంటుంది. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని నేడు(మార్చి 16 నాడు) ఆన్ లైన్లో రూ.100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసు కొనవచ్చును. ఒక ఫోన్ నంబరుతో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును. వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టివారిపై సెక్షన్ 416 of IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును. విద్యార్థుల ఎంపికకు “పాత జిల్లా” ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది. ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 45678 ని లేదా ప్రాస్పెక్టస్ లో “పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్ లో సంప్రదించవచ్చు. (ఉ. 10.30 గంటల నుండి సా. 5.00 గంటల వరకు). 2022-23 విద్యా సంవత్సరంలో 4 వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. (విద్యార్థినీ/విద్యార్థులు ఈ సంవత్సరం 4 వ తరగతి చదువుతున్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ /స్టడీ సర్టిఫికెట్ ను అప్లోడ్ ను చేయవలసి ఉంటుంది.) అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని గురుకులం సద్వినియోగ చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ వెంకటరామిరెడ్డి ఆశించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!