దొంగలు బాబోయ్…..దొంగలు…
మంథనిలో మళ్లీ మొదలైన దొంగల బెడద
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని మర్చి 14(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంథనిలో దొంగలు సంచరిస్తున్నారని పోలీసులే ప్రచారం చేయిస్తుండడంతో ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొంది. గత సంవత్సర కాలంగా సుమారు పదికి పైగా ఇళ్లలో దొంగతనాలు జరిగిన ఇప్పటివరకు దొంగల ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. రామగుండం కమిషనరేట్కు కొత్తగా వచ్చిన కమిషనర్ రేమా రాజేశ్వరి మంథనిలో దొంగల బెడదపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకున్న దొంగలు యదేచ్ఛగా వారి పని వారు సాఫీగా చేసుకుపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ముఖ్యంగా బీహార్ రాష్ట్రం నుండి పొలం పనులు ఇతరత్రా పనుల కొరకు వచ్చినవారు ఈ దొంగతనాలకు పాల్పడే అవకాశాలున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుంది.పట్టణంలోని వాగుగడ్డ ప్రాంతంలో తాళం ఉన్న ఇంటిలో మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న రాజు మేడారం పోయి ఆదివారం ఇంటికి చేరుకోవడంతో తాళం పగలగొట్టి లూటీ చేశారు. ఇంట్లో ఏడు తులాల బంగారం తో పాటు విలువైన వస్తువులు దోచుకు వెళ్లారని బాధితుడు బోరున విలపించాడు. గత సంవత్సరం ఫిబ్రవరి 16న ఒకేరోజు ఐదు ఇండ్లలో దొంగతనాలు జరిగిన విషయం అప్పట్లో సంచలనం అయింది. ఇప్పటివరకు వారి ఆచూకీ పోలీసులు కనుగొనకపోవడంతో అప్పటినుండి ఇప్పటివరకు అడపా తడప దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 16న తమ్మి చెరువు కట్ట వీధిలో గల రిటైర్డ్ ఎంపీడీవో ముద్దు ప్రకాష్ తో పాటు మరి నలుగురి ఇండ్లలో దొంగలు పడి నగలు ఇతరత్రా సామాగ్రిని దోచుకునిపోయారు. ఇప్పటివరకు ఈ విషయమై ఎఫ్ఐఆర్ కాపీని బాధితులకు ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలోని కొన్ని సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగల బాగోతం పూర్తిగా బట్టబయలైంది అయినప్పటికీ వారి ఆచూకీ ఇప్పటికీ తెలుపక తెలుసుకోకపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావం తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో అడపా తడప తాళాలు ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగల ఆచూకీ పై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసుల పైనే ఎంతైనా ఉంది.