జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కు ఘన సన్మానం
నిధుల మంజూరి పట్ల ప్రజా ప్రతినిధుల హర్షం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 14(కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించిన పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ కు ప్రజా ప్రతినిధులు ఘన సన్మానం చేశారు. మంథని మండలం ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని గద్దలపల్లి నుంచి ముత్తారం మండలం సీతంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణానికి ఒక కోటి 85 లక్షల నిధులు మంజూరి చేయించడం పట్ల స్థానిక సర్పంచ్ బుద్ధర్తి రవి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు జడ్పీ చైర్మన్ ను శాలువాతో సత్కరించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు మండలాలకు డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేయించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.