మంథని రోషిణి డిగ్రీ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్ కోరకు శిక్షణ
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని, మార్చి 14(కలం శ్రీ న్యూస్ ):మంథని స్థానిక రోషిణి డిగ్రీ కళాశాల గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థిని, విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ కొరకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. కంపెనీ వాళ్ళను పిలిపించి ఉద్యోగ అవకాశములు కల్పించబడుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరంలో మంగళవారం రోజున రోషిని డిగ్రీ కళాశాల ఆవరణంలో ఐసీఐసీఐ ప్రడెన్షల్ వారి ఆధ్వర్యంలో సుధీర , పారస్ రీజనల్ హెచ్ .ఆర్ లు క్యాంపస్ సేలక్షన్ నిర్వహించారు. దీనిలో 30 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనగా 05 మంది ఉద్యోగానికి అర్హత సాధించారు. గత వారంలో నిర్వహించిన ఉద్యోగుల సెలక్షన్ కు 11 మంది కాగా ఈ రోజు ఐదుగురు సెలెక్ట్ ఉద్యోగ అర్హత సాధించిన వారినికళాశాల కరస్పాండెంట్. రేపాల రోహిత్, ప్రిన్సిపల్ రాజు, ఏ ఓ అవధానుల శ్రీనివాస్, అధ్యాపక బృందం అభినందించారు.