Monday, July 15, 2024
Homeతెలంగాణపెద్దపల్లిలో ఘనంగా జరిగిన కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

పెద్దపల్లిలో ఘనంగా జరిగిన కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

పెద్దపల్లిలో ఘనంగా జరిగిన కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

 పెద్దపల్లి,మార్చి13(కలం శ్రీ న్యూస్ ):తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోనీ కుమ్మరి వాడ కంచర్ బావి ప్రాంతంలో తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొల్ల మాంబ చిత్రపటానికి పూలమాలలు, వేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు టీ.కే .శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆషాడపు లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కటికనపల్లి రవీందర్, కుమ్మర సంఘం నాయకులు పోచంపల్లి రమేష్,మర్రిపల్లి రాజు, విలాసాగర్ రాజేశం, ఎనగందుల సమ్మయ్య, విలాసాగర్ ప్రసాద్,ఇటికాల కనకయ్య, ఇటికాల లక్ష్మణ్, ఆషాడపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!