సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయండి
మంథని మార్చి 13((కలం శ్రీ న్యూస్ ):మంథనిలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య హాజరై మాట్లాడుతూ సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 23వ తేదీ నుండి ఆదిలాబాద్ నుండి సిపిఎం జన చైతన్య యాత్ర ప్రారంభం కానుందని ఈ యాత్రను సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు బివి. రాఘవులు ప్రారంభిస్తారని యాత్రకు రథసారధిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య సారథ్యం వహిస్తారని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం దళితుల పైన గిరిజనుల పైన ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీల పైన దాడులు చేస్తూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని అన్నారు. విద్యను కాషాయకరణం చేస్తూ పేదవారికి విద్యను అందకుండా చేస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ నెల 25వ తేదీన ఈ యాత్ర గోదావరిఖానికి చేరుతుందని మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఈ బహిరంగ సభకు మంథని ప్రాంతం నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు అభిమానులు మేధావులు ప్రజాస్వామిక వాదులు స్వచ్ఛంద సంస్థల నాయకులు హాజరై సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మహేశ్వరి వేల్పుల కుమారస్వామి జిల్లా కమిటీ సభ్యులు గుడి దగ్గర గణేష్ నాయకులు గొర్రెoకల సురేష్, శ్రీకాంత్, రవి,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు