Monday, July 15, 2024
Homeతెలంగాణతెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు విజయవంతం చేయండి -

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు విజయవంతం చేయండి –

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు విజయవంతం చేయండి 

సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కూకట్ల నాగరాజు.

సుల్తానాబాద్,మార్చి11(కలం శ్రీ న్యూస్):                         హైదరాబాదు లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ అధ్వర్యంలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు కార్యక్రమానికి మండలంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనాలని తెలంగాణ ఉద్యమకారుల సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కూకట్ల నాగరాజు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారుల సంక్షేమబోర్డుకు కృషి చేయాలని కోరారు. ఉద్యమకారులవి న్యాయమైన డిమాండ్లు అని , తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి 10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలనీ, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తెలంగాణ ఉద్యమకారులకు వాటా కేటాయించాలి అని అన్నారు.ఉద్యమకారులకి పెన్షన్ , ఉచిత బస్సు , ట్రైన్ పాస్ లను , ఆరోగ్య శ్రీ కార్డులను , అలాగే 300 గజాల ఇంటి స్థలాన్ని , వడ్డీ లేని రుణాలను కేటాయించాలి అని అన్నారు.తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రస్తుత తెరాస ప్రభుత్వం న్యాయం చేయలేదు అని , తెలంగాణ ద్రోహులకు ఈ తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , కావున తెలంగాణ ఉద్యమకారులకు సరియైన న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కూకట్ల నాగరాజు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!