సంకటాలు తొలగించే విగ్నేశ్వరుడు
చతుర్థి పూజలందుకున్న మహాగణపతి
అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
మంథని మార్చి 10(కలం శ్రీ న్యూస్):సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి దీక్షతో భక్తులు పునీతులు అవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వచ్చిన సంకటహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులతో శ్రీ విఘ్నేశ్వర స్వామిని భక్తులు దర్శిం
చుకుని పునీతులయ్యారు. ప్రతి నెలలో ఒకసారి వచ్చే సంకటహర చతుర్థి పర్వదినం రోజున శ్రీ మహాగణపతి దేవాలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం రాత్రి 8 గంటల 40 నిమిషములకు చంద్రోదయం అనంతరం చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు చంద్రోదయం అనంతరం భోజనం చేస్తారు. మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో గల శ్రీ మహాగణపతి దేవాలయం ఎంతో విశిష్టత సంతరించుకుంది. పాలుగుణ మాసంలో వచ్చిన ఏకైక సంకట చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకున్నారు. సంకటహర చతుర్థి పర్వదినం రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి కి 121 మోదకుడు సమర్పించడం అలాగే దూర్వాలు సమర్పించడం ఎంతో శ్రేయస్కరం అని భక్తుల విశ్వాసం. ప్రతినిత్యం ముఖ్యంగా ప్రతి మంగళవారం ఎందరో భక్తులు ఆలయంలో మహా గణపతిని దర్శించుకొని వెళుతుంటారు. ప్రతి మంగళవారం భక్తులు విగ్నేశ్వరుని పూజిస్తుంటారు. ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున మంథని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సంకటహర చతుర్థి దీక్ష పట్టిన భక్తులు రాత్రి చంద్రోదయం అనంతరం మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అనేక రకాల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పల్లి సంజీవ్, రాము సోదరులు ఆలయంలో లో స్వామి వారిని అలంకరిస్తూ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు.