Monday, July 15, 2024
Homeతెలంగాణఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

 

సుల్తానాబాద్,మార్చి10(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కూకట్ల నాగరాజు కోరిక మేరకు ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు యొక్క పోస్టర్లను ఆవిష్కరించిన సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల శ్రీరాములు.

 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు ప్రతి ఒక్క ఉద్యమకారుడు హాజరు కావాలని అన్నారు.అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డుకు కృషి చేయాలని కోరారు.ఉద్యమకారులవి న్యాయమైన డిమాండ్లు అని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించాలనీ,అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తెలంగాణ ఉద్యమకారులకు వాటా కేటాయించాలి అన్నారు.ఉద్యమకారులకి పెన్షన్ , ఉచిత బస్సు , ట్రైన్ పాస్ లను , ఆరోగ్య శ్రీ కార్డులను , అలాగే 300 గజాల ఇంటి స్థలాన్ని , వడ్డీ లేని రుణాలను కేటాయించాలి అని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని అన్నారు.

అనంతరం అడ్వకేట్ బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఎలాంటి కోర్టు ఫీజు తీసుకోకుండా పనిచేయడం జరిగింది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెగడ శ్యాంసుందర్ , బోయినీ భూమయ్య , జోగుల రమేష్ , చీకటి సంతోష్ , దూడం ఆంజనేయులు , కొమురవెల్లి అశోక్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!