Monday, July 15, 2024
Homeతెలంగాణబుగ్గారం ఉప సర్పంచ్ కి విజ్ఞాపన పత్రం ఇచ్చిన విడిసి

బుగ్గారం ఉప సర్పంచ్ కి విజ్ఞాపన పత్రం ఇచ్చిన విడిసి

బుగ్గారం ఉప సర్పంచ్ కి విజ్ఞాపన పత్రం ఇచ్చిన విడిసి

 

జగిత్యాల మార్చి 9 (కలం శ్రీ న్యూస్):

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ ఉప సర్పంచ్ నగునూరి రామకృష్ణ కు గ్రామ అభివృద్ధి కమిటీ పక్షాన రెండు కోట్ల ఆరులక్షల లెక్క చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామపంచాయతీ లో బ్యాంక్ ఖాతాల నుండి డ్రా చేసిన రెండు కోట్ల ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఒక వంద ఎనిమిది రూపాయల లెక్క ప్రజలకు చెప్పాలని వారు విజ్ఞాన పత్రం లో పేర్కొన్నారు. గత మూడు ఏళ్ళు గా ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు లెక్కలు తేల్చడం లేదన్నారు. మీరైనా వాటిని బయటికి తీసి ప్రజల సొమ్ము కాపాడాలని ఉప సర్పంచ్ ను కోరారు. ఇట్టి డబ్బులతో బుగ్గారం గ్రామంలో ఎక్కడెక్కడ ఏ – ఏ పనులు చేశారో గ్రామ ప్రజలకు పూర్తి వివరంగా ఆధారాలతో సహా చూపెట్టాలని కోరారు. మీరు కూడా అలాంటి పొరపాట్లు చేసి చట్టపరంగా కేసుల పాలు కావొద్దని, గ్రామ ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దని ఉప సర్పంచ్ రామకృష్ణ కు విడిసి కమిటి వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి, కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి, విడిసి సభ్యులు కప్పల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!