Friday, November 8, 2024
Homeతెలంగాణనేడు వెల్గటూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద భాజపా మూడు గంటల రైతు దీక్ష 

నేడు వెల్గటూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద భాజపా మూడు గంటల రైతు దీక్ష 

నేడు వెల్గటూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద భాజపా మూడు గంటల రైతు దీక్ష 

 

జగిత్యాల మార్చి 9 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రము లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మూడు గంటల పాటు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించబడుతుందని బీజేపీ కిసాన్ మోర్చా ఉమ్మడి వెల్గటూరు మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు తెలిపారు.

రైతుల పక్షాన వారు ఎదుర్కొంటున్న ప్రధాన నాలుగు సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మొదటి డిమాండ్ రైతులు తీసుకున్న ఒక లక్ష రూపాయల వరకు గల రుణ మాఫీ వడ్డీతో సహా తక్షణమే చేయాలి. రెండవ డిమాండ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తెలంగాణ రాష్ట్రం లో అమలు చేయాలి. మూడవ డిమాండ్ రైతులకు నిరాటంకంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి‌. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలతో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున వెల్గటూర, ఎండపల్లి మండలాల్లోని భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రావు హన్మంత రావు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!