Monday, July 15, 2024
Homeతెలంగాణవ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

సుల్తానాబాద్,మార్చి08,(కలం శ్రీ న్యూస్):అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్ కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేసి మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, మహిళ డైరెక్టర్ కల్లేపల్లి రజని లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుర్ర మౌనిక మాట్లాడుతూ కేసీఅర్ ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తున్నారని, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అన్నెడి మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు పొన్నం చంద్రయ్య గౌడ్, గరిగంటి కుమార్ బాబు, ఒజ్జ సంపత్, బోయిని ముత్యాలు, వడకాపురం ఆంజనేయులు, మార్కెట్ కార్యదర్శి సతీష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!