బుగ్గారం యాదవ సంఘం అధ్యక్షునిగా వినోద్ యాదవ్
జగిత్యాల, మార్చి 8 (కలం శ్రీ న్యూస్): యాదవ హక్కుల పోరాట సమితి ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ పూదరి సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో బుగ్గారం మండల కేంద్రం లోని యాదవ భవన్ బుధవారం మండల కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
బుగ్గారం మండల యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గా ఎరవేణి వినోద్ యాదవ్, ఉపాధ్యాక్షులుగా పెద్దినేని రాజేశం యాదవ్, పరమాల రాజేశం యాదవ్, గనవేని తిరుపతి యాదవ్, లు ప్రధాన కార్యదర్శిగా పెద్దినేని రాజు యాదవ్, కార్యదర్శులుగా పరుమాల శేఖర్, గాంతుల సురేష్, సౌదరి లచ్చన్న, పెద్దినేని రాజన్న లు, అధికార ప్రతినిధిగా పరుమాల శంకర్ యాదవ్, కోశాధికారిగా జక్కుల రవి యాదవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎలుక భగవాన్ యాదవ్ తెలిపారు.
ఈ సమావేశంలో గొల్లపల్లి మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి యాదవ్, పరుమాల ఓదెలు యాదవ్, చౌదరి బాపన్న, ఉడుత రాజు, ఎరవేణి రంజిత్ లతోపాటుగా పది గ్రామాల యాదవ సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.