Monday, July 15, 2024
Homeతెలంగాణశెగ్యాం అంబారిపేట రోడ్డుకు నిధుల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ లు

శెగ్యాం అంబారిపేట రోడ్డుకు నిధుల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ లు

శెగ్యాం అంబారిపేట రోడ్డుకు నిధుల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ లు

జగిత్యాల, మార్చి 7 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం శెగ్యాం అంబారిపేట రోడ్డు నిర్మాణానికి పన్నెండు కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంగళవారం రోజున మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఐదు గ్రామాల సర్పంచ్ లు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం లోని వెల్గటూరు మండలం శెగ్యాం, తాళ్ల కొత్తపేట మీదుగా పైడిపల్లి, సంకెనపల్లి, పక్కగా ఏడవ నెంబర్ రాష్ట్ర రహదారి అంబారిపేట వరకు నూతన రోడ్డు నిర్మాణం, విస్తరణ పనులకు గాను 12 కోట్ల నిధులు మంజూరు చేశారు. మారుమూల గ్రామాలను కలుపుతూ దూరాన్ని తగ్గించేందుకు గాను రోడ్డు నిర్మాణం కు నిధులు మంజూరు చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు లకు శెగ్యాం, తాళ్ళ కొత్తపేట, సంకెనపల్లి, అంబారిపేట గ్రామాల సర్పంచ్ లు రామిల్ల లావణ్య సనిల్, ద్యావనపల్లి లక్ష్మి ఎల్లయ్య, గంగుల నగేష్, ముల్కల్లా గంగారాం, దుర్గం లక్ష్మి తిరుపతిలు ధన్యవాదములు తెలిపారు.

రోడ్డు పొడవు 8.10 కిలో మీటర్ల పని కోసం పరిపాలనా అనుమతిని మంజూరు చేసిన రోడ్లు భవనాల శాఖ అంచనా వ్యయం రూ. CRR (ప్లెయిన్) గ్రాంట్ కింద 1200.00 లక్షలు (రూపాయిలు పన్నెండు వందల లక్షలు మాత్రమే) పేర్కొన్న పని యొక్క పని బిల్లులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పాక్షికంగా, తదుపరి ఆర్థిక సంవత్సరంలో మిగిలిన బిల్లులు 2023-24లో మాత్రమే క్లెయిమ్ చేయబడతాయని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!