Tuesday, October 8, 2024
Homeతెలంగాణనేతకాని సమాజాన్ని ప్రభుత్వం గుర్తించాలి

నేతకాని సమాజాన్ని ప్రభుత్వం గుర్తించాలి

నేతకాని సమాజాన్ని ప్రభుత్వం గుర్తించాలి

రాజకీయంగా వెనుకబడిన నేతకాని కులం

మంథని ఫిబ్రవరి 22(కలం శ్రీ న్యూస్):రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిపోయిన నేతకాని కులాన్ని ప్రభుత్వం గుర్తించాలని నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ పేర్కొన్నారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేతకాని కులానికి చెందిన వారందరూ సంఘటితమై తమ హక్కులు సాధించుకోవాలన్నారు. ఈమధ్య గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో నేతకాని కులానికి చెందిన 8 సంఘాలు ఏకమై నేతకాని మహార్ సంఘంగా రూపాంతరం చెందిందన్నారు. అనంతరం రాష్ట్ర పోలిట్ బ్యూరో కన్వీనర్ సెగ్గం రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 19 ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానాల్లో నేతకాని సమాజానికి తగిన గుర్తింపు నివ్వాలని కోరారు.వచ్చే ఏప్రిల్ మే మాసాల్లో హైదరాబాదులో నేతకాని సింహ గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేతకాని కులానికి చెందిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నారు. స్వాతంత్ర పోరాటంలో నేతకాని ఉదాహరణకు చెందిన వారి పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లి రాజమల్లు మాట్లాడుతూ రాష్ట్రంలో మాల మాదిగల తర్వాత అత్యధిక శాతం ఉన్న నేతకాని కులానికి చెందిన వారికి ఎలాంటి గుర్తింపు లేకపోవడం శోచనీయమన్నారు. పోడు భూముల పంపిణీలో నేతకాని వారికి పట్టాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు దుర్గం నరసయ్య, జిల్లా నాయకులు దుర్గం నగేష్, మోతే నరేష్, సెగ్గం సంతోష్, జాడి రాజయ్య, బండారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!