వలస కార్మికుల భద్రత పట్టించుకోని ఇటుకబట్టి యాజమాన్యం
పెద్దపల్లి ఫిబ్రవరి 22 కలం శ్రీ న్యూస్
ఇటుకబట్టీల్లో పని చేస్తున్న వలస కార్మికుల భద్రతను పట్టించుకోకుండా,వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంటిఎన్ బ్రిక్స్ యజమాని జాఫర్ పై చర్యలు తీసుకోవాలని దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంకూరి కైలాసం అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బుధవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంటిఎన్ బ్రిక్స్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదని ఆరోపించారు.పిల్లలకు పాఠశాల,కార్మికులకు జీవిత భీమా,మరుగు దొడ్లు,తదితర సౌకర్యాలు అందించ కుండా,శ్రమదోపిడి చేస్తున్నారని,ఇదేంటని ప్రశ్నించిన కార్మిక నాయకులను బెదిరించి,కేసులు పెడతామని భయబ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు.సంబందిత అధికారులు వెంటనే కల్పించుకొని కార్మిఉలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నాయకులు కండె కరుణాకర్,జనగామ జనార్ధన్,మల్లారపు కుమార్,కలవేన స్వామి, మంథని వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.