తెలుగు భాషగొప్పతనం విదేశాల వారికి ఎక్కువ తెలుసు
డాక్టర్ అశోక్ కాచె
మంథని ఫిబ్రవరి 21(కలం శ్రీ న్యూస్): కాచె మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యు.ఎస్.ఏ.వ్యవస్థాపకులు మాతృభాష గొప్ప తనం విదేశాల లో ఎక్కువ ప్రాధాన్యత సంచరించుకుందని డాక్టర్ అశోక్ కాచె అన్నారు.అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నృసింహ శివకిరణ్ గార్డెన్స్ లో మంథని శాసన సభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనవూరు,మన కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షల కు తయారవుతున్న విద్యార్థుల తో మాట్లాడిన తర్వాత బాష భావ వ్యక్తీకరణకు ఉపయోగమైనధని,మాతృభాష లో విద్యాబోధన తో విద్యార్థులకు అధిక ప్రయోజనం ఉంటుందన్నారు.అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వరలక్ష్మి హరీష్ కాచె మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ ప్రకటన, పూర్వ పరాలను వివరించారు.విద్యార్థులు మరింత కష్టపడి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో శశిభూషణ్ కాచె,మున్సిపల్ కౌన్సిలర్లు చొప్పకట్ల హన్మంతు,పెండ్రు రమ,దుద్దిళ్ళ గణపతి,అజీంఖాన్ లు పాల్గొన్నారు,అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ను సందర్శించిన డాక్టర్ అశోక్ కాచె విద్య భోధన పద్ధతులను ప్రిన్సిపల్, అధ్యాపకులతో అడిగి తెలుసుకున్నారు.