Tuesday, October 8, 2024
Homeతెలంగాణమళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్...

మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…

మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…

హైదరాబాద్,జులై4(కలం శ్రీ న్యూస్):

బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరారు. తాజాగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజు సారయ్యలు హస్తం గూటికి చేరారు.వీరి చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కి పెరిగింది. మండలిలో సభ్యుల సంఖ్య 40. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది. ఇక సీనియర్ నేత కే.కేశవరావు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకాదు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!