Thursday, October 10, 2024
Homeతెలంగాణతెలంగాణలో గుట్కా తయారి,అమ్మకం నిషేధం

తెలంగాణలో గుట్కా తయారి,అమ్మకం నిషేధం

తెలంగాణలో గుట్కా తయారి,అమ్మకం నిషేధం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

 హైద‌రాబాద్, మే 26(కలం శ్రీ న్యూస్):: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్యానికి హానిక‌ర‌మైన గుట్కాను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గుట్కా తయారీ, అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. గుట్కా, పాన్ మాసాల‌లో ఆరోగ్యానికి హాని క‌లిగించే పొగాకు, నికోటిన్ ఉండ‌డం మూలంగానే వాటిని నిషేధించిన‌ట్లు పేర్కొన్నారు. గుట్కాను త‌యారు చేసినా, నిల్వ ఉంచినా, విక్ర‌యాలు జ‌రిపినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

ఏడాదిపాటు నిషేధం

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని సెక్షన్ 30లోని సబ్‌సెక్షన్ (2)లోని క్లాజ్ (ఎ) కింద వచ్చిన అధికారాలను ఉపయోగించి ఆహార భద్రత, ప్రమాణాల శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు, నికోటిన్‌లను పొగాకు/పౌచ్‌లు/ప్యాకేజీ/కంటెయినర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా/పాన్ మసాలాల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించారు. వీటి అమ్మకాలపై నిషేధం, పరిమితి రెగ్యులేషన్ 2011లోని 2.3.4 ప్రకారం ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఈ చర్య తీసుకున్నారు. మే 24 వతేదీ నుంచి ఒక సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ పేరుతో పిలిచినా గుట్కాలను నిషేధించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!