తెలంగాణ లో ఈ ప్రశ్నాపత్రాల లీకులు ఏంది స్వామి
హైదరాబాద్,ఎప్రిల్04(కలం శ్రీ న్యూస్): సోమవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్ష మొదలైన కేవలం 7 నిమిషాల్ల్లోనే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ చక్కర్లు కొట్టడం అందరిని షాక్ కు గురిచేసిందనీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా మంగళవారం హిందీ పేపర్ సైతం లీక్ కావడం సంచలనం రేపుతోంది. పరీక్షా మొదలైన గంటలోనే ప్రశ్నాపత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. ఈ ఘటన ఏ జిల్లాలో చోటుచేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే వరుస ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇక ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
ఆన్సర్ షీట్లు మిస్సింగ్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్‌షీట్‌ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా..? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా..? అనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు అవి ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.