తారకరత్న కు తీవ్ర అస్వస్థత
కుప్పం,జనవరి27(కలం శ్రీ న్యూస్): : నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శుక్రవారం కుప్పం నియోజక వర్గం కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోవడంతో చికిత్స కోసం హుటాహుటినా కుప్పం ఆస్పత్రికి తరలించారు.
కుప్పంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ విషయం తెలుసుకుని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.