Tuesday, December 9, 2025

మున్సిపల్ కార్మికుల భద్రతకు వివిధ ప్రభుత్వ బీమా పాలసీలు 

మున్సిపల్ కార్మికుల భద్రతకు వివిధ ప్రభుత్వ బీమా పాలసీలు 

సుల్తానాబాద్, డిసెంబర్ 02(కలం శ్రీ న్యూస్): మున్సిపల్ కార్మికుల భద్రత కోసం వివిధ ప్రభుత్వ బీమా పాలసీల ద్వారా భద్రత కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వం ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందించే వివిధ పాలసీల పై కార్మికులకు పెద్దపల్లి పోస్టల్ బ్రాంచ్ మేనేజర్ పి.మోహన్ సాయి తో కలిసి అవగాహన కల్పించారు. ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మూడు స్కీముల ను కల్పించిందని, 549 రూపాయలతో పాలసీ పొందితే యాక్సిడెంట్ డెత్ తో పాటు శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి పది లక్షలు ప్రమాద బీమా కల్పిస్తుందని, కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి సైతం పది లక్షల రూపాయలు అందించడంతో పాటు వైద్య ఖర్చులకు 60 వేల రూపాయలను అందిస్తుందని, బాధితుల కుటుంబంలోని ఇద్దరూ పిల్లల చదువుల ఖర్చులకు లక్ష రూపాయలు అందిస్తుందని, రవాణా సౌకర్యం చార్జీలను 25 వేల రూపాయలు అందించడంతోపాటు అంత్యక్రియలకు సైతం డబ్బులను అందించే సదుపాయం కల్పించిందని తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ద్వారా 436 రూపాయలు చెల్లిస్తే ఏలాంటి మృతి చెందిన వారి కైనా రెండు లక్షల రూపాయలు అందిస్తుందని కేవలం ఒక్క వారం రోజుల్లోనే డబ్బు చేతికి అందేలా ఈ పాలసీ ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 20 రూపాయలు చెల్లిస్తే రెండు లక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కార్మికులకు 549 రూపాయల పాలసీని మున్సిపల్ చెల్లిస్తుందని కార్మికులు 460 రూపాయలు చెల్లించి ఇతర పాలసీలు పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్ ఏ ఈ రాజ్ కుమార్ సిబ్బంది కార్మికులు పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles